‘మీరు ఎప్పుడు తల్లికాబోతున్నారు?’ అన్న నెటిజన్ ప్రశ్నకు సమంత వ్యంగ్యం!
- ఇన్ స్టాగ్రామ్ వేదికగా సమంతను ప్రశ్నించిన అభిమాని
- 2022, ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు బిడ్డకు జన్మనిస్తాన్న సమంత
- పలు ప్రశ్నలు అడిగిన నెటిజన్లు..వీడియో పోస్ట్ చేసిన సామ్
తాజాగా, ఇదే విషయమై ఇన్ స్టాగ్రామ్ వేదికగా ‘మీరు ఎప్పుడు తల్లికాబోతున్నారు?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. 2022 సంవత్సరంలో ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు ఓ బిడ్డకు జన్మనిస్తానని చెప్పింది. ఈ వీడియోను సమంత షేర్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమంత బదులివ్వడం ఈ వీడియోలో కనిపిస్తుంది.