ఇకపై పారితోషికం పెంచుతానేమో: హీరో శ్రీవిష్ణు
- 'బ్రోచేవారెవరురా'తో భారీ హిట్
- తదుపరి చిత్రంగా 'తిప్పరా మీసం'
- సక్సెస్ పై నమ్మకం ఉందన్న శ్రీవిష్ణు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'బ్రోచేవారెవరురా' విజయం తరువాత పారితోషికం పెంచారా?' అనే అంతా అడుగుతున్నారు. ఆ సినిమాకి ముందే నేను నాలుగు సినిమాలు కమిట్ అయ్యాను. అందువలన పారితోషికం పెంచమని వాళ్లను అడగలేను. ఈ మూడు ప్రాజెక్టుల తరువాత చేసే సినిమాలకి పారితోషికం పెంచుతానేమో" అన్నాడు. ఇక తన తాజా చిత్రమైన 'తిప్పరా మీసం' తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.