శ్రీవిష్ణు పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి: 'తిప్పరా మీసం' దర్శకుడు
- మదర్ సెంటిమెంట్ తో ముడిపడిన కథ
- పబ్ లో డీజేగా కనిపించనున్న శ్రీవిష్ణు
- ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు
తాజా ఇంటర్వ్యూలో కృష్ణ విజయ్ మాట్లాడుతూ .."ఇది మదర్ సెంటిమెంట్ తో ముడిపడిన కథ. తల్లి కోసం హీరో ఏం చేశాడనే దిశగా ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు .. ఒక పబ్ లో డీజేగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది .. పాజిటివ్ గా ముగుస్తుంది. శ్రీవిష్ణు చేసిన ఈ పాత్ర ఆయన కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ .. ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందనే నమ్మకం వుంది" అని అన్నాడు.