తెలుగు తెరకి మరో మలయాళ హీరోయిన్!
- మలయాళంలో హిట్ కొట్టిన 'పడయోత్తం'
- తెలుగులోనూ 'ఐమా'కే ఛాన్స్
- డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్
మలయాళంలో క్రితం ఏడాది చివర్లో వచ్చిన 'పడయోత్తం' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాలో కథానాయికగా చేసిన 'ఐమా'కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తెలుగులోను కథానాయికగా 'ఐమా'నే తీసుకున్నారు. విను యజ్ఞ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోగా సుమంత్ చేయనున్నాడు. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.