తెలుగులోను విజయ్ సినిమాపై పెరిగిన క్రేజ్
- తమిళంలో 'బిజిల్' భారీ రిలీజ్
- భారీస్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్
- రెండు భాషల్లోను ఒకే రోజున విడుదల
ఇంతకుముందు తమిళంలో విజయ్ చేసిన 'సర్కార్' సినిమా, తెలుగులోను మంచి వసూళ్లను రాబట్టింది. అందువలన తాజా చిత్రమైన 'విజిల్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగినట్టుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టు చెబుతున్నారు. తెలుగుకి సంబంధించినంత వరకూ, విజయ్ కెరియర్లో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదేనని అంటున్నారు. కథానాయిక నయనతార కావడం కూడా బిజినెస్ పరంగా కలిసొచ్చిందని చెబుతున్నారు.