కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్
- 'మహనటి'తో మంచి గుర్తింపు
- నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తాజా చిత్రం
- గిరిజన యువతి పాత్రలో కీర్తి సురేశ్
ఇంకా టైటిల్ ను నిర్ణయించని ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంతసేపటి క్రితం ఈ సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఓ గిరిజన యువతిగా ఆమె ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.