మళ్లీ విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి వంగా
- 'అర్జున్ రెడ్డి' సంచలన విజయం
- యూత్ కి విజయ్ దేవరకొండను చేరువ చేసిన సినిమా
- మరోసారి సెట్స్ పైకి వెళ్లనున్న కాంబినేషన్
ఆ సినిమా నిర్మాతలతోనే సందీప్ రెడ్డి వంగా హిందీలో మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలోనే వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు తరువాత తన సినిమా విజయ్ దేవరకొండతోనే వుండనున్నట్టు చెప్పాడు. సందీప్ రెడ్డి వంగా ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం వలన, వచ్చే ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.