విస్కీకి బానిసయ్యా... రెండేళ్లు విపరీతంగా తాగా: శ్రుతిహాసన్
- విపరీతంగా మందు తాగడం వల్ల ఆరోగ్యం పాడయింది
- అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది
- మంచు లక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన శ్రుతి
తాను ఒకానొక సమయంలో విస్కీకి బానిసనయ్యానని శ్రుతి తెలిపింది. రెండేళ్ల పాటు వివరీతంగా మందు తాగానని... దాంతో, తన ఆరోగ్యం పాడయిందని చెప్పింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వెల్లడించింది. టాలీవుడ్ లో చివరిసారిగా పవన్ కల్యాణ్ సరసన 'కాటమరాయుడు' చిత్రంలో శ్రుతి నటించింది. ఇప్పుడు రవితేజ సినిమాతో మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది.