ఎన్బీకే కార్యాలయం నుంచి అసభ్య ప్రచారం చేస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
- జగన్ కుటుంబంపై దుష్ప్రచారం తగదు
- ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశాం
- టీడీపీ పెట్టిన పోస్టింగ్స్ ను మేము నిరూపిస్తాం
హైదరాబాద్ లోని ఎన్బీకే కార్యాలయంలో రెండు వేల మంది పనిచేస్తూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పెట్టిన పోస్టింగ్స్ ను తాము నిరూపిస్తామని, ఈ విషయమై చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా ద్వారా మభ్యపెట్టే కార్యక్రమాలు చంద్రబాబు ఆపాలని, ఆయన అకృత్యాలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్స్ ను ఖండిస్తున్నట్టు చెప్పారు.