ఇప్పటి హీరోల తీరుపై టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన
- ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాంటి అవార్డు ఇచ్చినా వచ్చి తీసుకునేవారన్న టీఎస్సార్
- ఇప్పటి హీరోలు సీనియర్లను ఫాలో కావడంలేదని వ్యాఖ్యలు
- హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కళా ప్రేమికుడు
అయితే, ఇప్పటితరం హీరోలు అవార్డులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోడం తనను బాధిస్తోందని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రహీరోలు ఎలాంటి అవార్డు ఇచ్చినా వచ్చి తీసుకునేవారని, ఇప్పటి హీరోలు అవార్డుల విషయంలో సీనియర్లను అనుసరించడంలేదని అన్నారు. కొందరు సినీ కళను తక్కువ చేసి మాట్లాడుతుంటారని, అయితే అనేక శాఖల్ని తనల్లో కలుపుకున్న సినిమా భగవంతుడి సృష్టిలో ఎంతో గొప్ప కళ అని టీఎస్సార్ అభిప్రాయపడ్డారు.