'బిగ్ బాస్ 3' నాగ్ ప్లేస్ లో ప్రత్యేక హోస్ట్ గా రమ్యకృష్ణ
- 40 రోజులు పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్ 3'
- ఇంటి నుంచి ఈ వారం మరొకరు బయటికి
- విదేశాలకి వెళ్లిన నాగార్జున
'బిగ్ బాస్' సీజన్ 3 మొదలై 40 రోజులు దాటింది. ప్రతివారం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ, తనదైన శైలిలో ఈ కార్యక్రమాన్ని రక్తికట్టిస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి విదేశాలకి వెళ్లిన నాగార్జున, ఇంకా తిరిగిరాలేదు. అందువలన ఆయన ప్లేస్ లో ఈ వారానికిగాను వ్యాఖ్యాతగా వ్యవహరించవలసిందిగా రమ్యకృష్ణను 'బిగ్ బాస్ 3' నిర్వాహకులు కోరడంతో ఆమె అంగీకరించారు. శనివారం ఎపిసోడ్ లో రమ్యకృష్ణ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ప్రసారం చేస్తూనే వున్నారు. ఈ రెండు రోజుల పాటు వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.