బిగ్ బాస్-3... బయటకు వచ్చాక నలుగురిపై అషూ రెడ్డి ఆగ్రహం!
- ముందనుకున్నట్టే అషూ రెడ్డి ఎలిమినేషన్
- ఆద్యంతం నవ్వులు పూయించిన నాగ్
- మహేశ్, రాహుల్, వితికా, హిమజలపై కసి తీర్చుకున్న అషూ
ఆపై అషూ రెడ్డి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆపై హౌస్ ను వీడి బయటకు వచ్చిన అషూ చేత మరో గేమ్ ను ఆడించిన నాగ్, హౌస్ లో ఉండేందుకు అర్హత ఎవరికి ఉంది? ఎవరికి లేదు? అంటూ అడిగారు. అర్హత లేదని భావించేవారి ఫోటోలను పగలగొట్టాలని సూచించారు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో తనతో గొడవలు పడిన వారిపై అషూ ఆగ్రహాన్ని చూపించింది. మహేష్, రాహుల్, వితికా, హిమజలకు లోపల ఉండే అర్హత లేదంటూ వారి ఫోటోలను పగలగొట్టి, తన కసి తీర్చుకుంది.