'దొరసాని'లో ఆ సీన్ తీస్తుండగా జీవితగారు కాల్ చేశారు: దర్శకుడు కేవీఆర్ మహేంద్ర
- జీవితా రాజశేఖర్ గార్లకి ముందుగానే స్క్రిప్ట్ వినిపించాను
- వాళ్లిద్దరూ చాలా ఫ్రొఫెషనల్ గా ఆలోచిస్తారు
- ఆ సీన్ విషయంలో జీవితగారికి భరోసా ఇచ్చానన్న మహేంద్ర
జీవితగారు - రాజశేఖర్ గారు ఇద్దరు కూడా ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తారు. అందువలన వాళ్లేమీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఈ సీన్ కి నేను ఏ యాంగిల్ పెడతాను .. ఎలా డీలా చేస్తానా అనే ఒక సందేహం జీవితగారికి ఉండేది. అందువల్లనే ఆ సీన్ ను ఆ రాత్రికి తీస్తామనగా, ఆ సాయంత్రం ఆమె నాకు కాల్ చేశారు. అప్పుడు నేను 'మేడమ్ మీరు కంగారు పడకండి .. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా డీల్ చేస్తానో అలా డీల్ చేస్తానని ఆమెకి నేను భరోసా ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు.