ఆ సినిమా షూటింగ్ నుంచే వెళ్లిపోయి ప్రేమపెళ్లి చేసుకున్నాను: సీనియర్ హీరోయిన్ నళిని
- తెలుగులో తొలి సినిమా 'తోడు నీడ'
- అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నాను
- ఇంట్లో వాళ్లకి భయపడి చెన్నైలో అడుగుపెట్టలేదు
ఆ తరువాత విఠలాచార్య దర్శకత్వంలో 'కనకదుర్గ వ్రత మహాత్మ్యం' చేశాను. ఈ సినిమా చేస్తోన్న సమయంలోనే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవాడు. కొంతకాలంగా నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు .. పెళ్లి చేసుకుందామని అన్నాడు. అంతే .. షూటింగు మధ్యలో ఆయనతో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్లకి భయపడి చెన్నైకి రాకుండా రెండు నెలల పాటు ఎక్కడెక్కడో తలదాచుకుంటూ వచ్చాము" అని చెప్పుకొచ్చారు.