'ఇంద్ర'లో కత్తిపట్టి తొడగొట్టిన బాలుడు... ఇప్పుడిలా సమంతతో కలిసి..!
- బాల నటుడిగా పలు హిట్ చిత్రాల్లో నటించిన తేజ
- ఇప్పుడు 'ఓ బేబీ'తో సెకండ్ ఇన్నింగ్స్
- జూలై 5న విడుదల కానున్న చిత్రం
ఇప్పుడు పెద్దవాడైన తేజ ఆర్టిస్టుగా సెకండ్ లైఫ్ ను ప్రారంభించాడు. 'ఓ బేబీ' సినిమాలో సమంతకు మనవడిగా తేజ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన తేజ మాట్లాడుతూ, తాను మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించానని చెప్పాడు. మనిషికి సెకండ్ లైఫ్ వస్తే ఎలా ఉంటుందన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుందని, ఓల్డ్ ఏజ్ లో కనిపించే సమంతకు తాను మనవడినని చెప్పాడు. కాగా, ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది.