నా అసలుపేరు కృష్ణవేణి .. ఆ పేరు అలా మారిపోయింది: నటి రాధా ప్రశాంతి
- నాట్య ప్రదర్శనలిచ్చే దానిని
- అమ్మను ఒప్పించి నటన వైపుకు వచ్చాను
- హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చాను
ముందుగా 'ఈ దేశం ఏమైపోతుందో' అనే సినిమా చేశాను. ఆ తరువాత 'శ్రీదేవి నర్సింగ్ హోమ్'లో చేశాను. కానీ ఈ రెండు సినిమాల కంటే ముందు 'పరువు ప్రతిష్ఠ' విడుదలైంది. ఈ సినిమాలోని జర్నలిస్ట్ ప్రశాంతి పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాకు 'రాధ' పోలికలు ఉండటం వలన 'రాధ' అనీ .. 'ప్రశాంతి' పాత్రతో పాప్యులర్ కావడం వలన 'రాధా ప్రశాంతి' అని పిలిచేవాళ్లు. నా అసలు పేరు మాత్రం కృష్ణవేణి అని ఆమె చెప్పుకొచ్చారు.