ఒకే ఒక్క రాత్రిలో జరిగే కథగా 'ఖైదీ' .. టీజర్ రిలీజ్
- కార్తీ నుంచి రానున్న 'ఖైదీ'
- చీకటిలోనే జరిగే ఆసక్తికరమైన కథ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో 'ఖైదీ'గా డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించనున్నాడు. ఒక రాత్రివేళ జైలు నుంచి తప్పించుకున్న 'ఖైదీ' కోసం ఒక వైపున పోలీసులు .. మరో వైపున రౌడీ గ్యాంగ్ గాలిస్తూ ఉండటమనేది ఉత్కంఠభరితమైన మలుపులతో కొనసాగుతూ ఉంటుంది. అందువలన సినిమా అంతా చీకటిలోనే నడుస్తుంది. ఈ కారణంగానే ఈ సినిమాలో కథానాయికకి కూడా స్థానం లేకుండా పోయింది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ మాత్రం అంచనాలను పెంచేదిలానే వుంది.