సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హారర్ సినిమాతో వస్తున్న అంజలి
- విజయవాడలో రేపు మహర్షి వేడుక
- మోహన్ బాబు భార్యగా ఐశ్వర్య
* ఇటీవల విడుదలైన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించడమే కాకుండా, మహేశ్ బాబుకి ఆర్టిస్టుగా కూడా మరింత పేరును తెచ్చింది. ఈ క్రమంలో చిత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ ను రేపు (శనివారం) సాయంకాలం విజయవాడలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహేశ్, పూజా హెగ్డే, అల్లరి నరేశ్ తదితరులు హాజరవుతారు.
* ప్రముఖ నటుడు మోహన్ బాబు భార్యగా బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ నటించనుంది. మణిరత్నం నిర్మించే 'పొన్నియన్ సెల్వన్' భారీ చిత్రంలో వీరిద్దరూ భార్యా భర్తలుగా నటిస్తారని సమాచారం.