మొబైల్ అదృశ్యం విషయమై ఘర్షణ.. మహిళలు, చిన్నారి సహా 8 మందికి గాయాలు
- మొబైల్ పోగొట్టుకున్న అనిల్
- బుజ్జి అనే వ్యక్తిని నిలదీయడంతో ఘర్షణ
- గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
విషయం తెలుసుకున్న ఇరు వర్గాల వారూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారి సహా 8 మంది, మార్కపూడి కుమార్, గోపీచంద్, గరికపాటి తిరుపతమ్మ, గరికపాటి కోటేశ్వరి, మార్కపూడి శ్రీకాంత్, వేల్పుల సుధ, మార్కపూడి నాగయ్య, గరికపాటి కృపారావు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కిశోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.