అక్షయ్ కుమార్ కు మరిన్ని కష్టాలను తీసుకొచ్చిన పాత వీడియో!
- అక్షయ్ పౌరసత్వంపై దేశ వ్యాప్తంగా చర్చ
- తెరపైకి వచ్చిన అక్షయ్ పాత వీడియో
- టొరంటో నా సొంత ఇల్లు అంటూ అక్షయ్ వ్యాఖ్య
కెనడాలో జరిగిన ఓ ఈవెంట్ లో భారీగా వచ్చిన జనాలను ఉద్దేశించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, 'మీ అందరికీ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. నా సొంత ఇల్లు టొరంటో. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్లీ ఇక్కడికే తిరిగి వస్తా. ఇక్కడే ఉండిపోతా' అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.