100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన 'కాంచన 3'
- హిట్ కొట్టిన 'కాంచన 3'
- వసూళ్ల పరంగా తగ్గని దూకుడు
- 'కాంచన 4' చేసే ఆలోచన
తొలివారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. ఇంకా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు. కథాకథనాలు .. లారెన్స్ చిత్రీకరణ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో, 'కాంచన 4'కి లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.