భారీ వసూళ్లతో తమిళనాట దూసుకుపోతోన్న 'కాంచన 3'
- లారెన్స్ నుంచి 'కాంచన 3'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
- తమిళనాట మూడు రోజుల్లో 30 కోట్లు
ఇక తమిళనాట ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తమిళనాడులో ఈ సినిమా 3 రోజుల్లో 30 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. మూడు రోజుల వసూళ్ల విషయానికి సంబంధించి, రజనీ 'పేట' .. అజిత్ 'విశ్వాసం' తరువాత స్థానంలో ఈ సినిమా నిలిచిందని అంటున్నారు. ఈ హారర్ మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు.