'నాగకన్య'గా వస్తున్న తమిళ చిత్రం
- తమిళంలో నిర్మితమైన 'నీయా 2'
- నాగకన్యల నేపథ్యంలో సాగే కథ
- మే 10వ తేదీన రెండు భాషల్లోను విడుదల
ఎల్.సురేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను మే 10వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'నాగకన్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథాకథనాలు .. గ్రాఫిక్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయనే అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో నాగకన్యలుగా కనిపించే ముగ్గురు కథానాయికలకు తెలుగులో మంచి గుర్తింపు వుంది. ఇక పాము నేపథ్యంలో సాగే కథల పట్ల ఆసక్తిని చూపేవాళ్లు కూడా ఇక్కడ ఎక్కువే. అందువలన ఈ సినిమాపై దర్శక నిర్మాతలు ఆశాభావంతో వున్నారు.