'కాంచన 3' కచ్చితంగా హిట్ కొడుతుందట
- లారెన్స్ నుంచి మరో హారర్ థ్రిల్లర్
- హైలైట్ కానున్న తమన్ రీ రికార్డింగ్
- ఈ నెల 19వ తేదీన విడుదల
తాజాగా ఆయన మాట్లాడుతూ .. "ఇంతకుముందు లారెన్స్ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలకి మించి 'కాంచన 3' ఉంటుంది. బలమైన .. వైవిధ్యభరితమైన కథను ఆయన తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడ్డాడనేది తెరపై కనిపిస్తుంది. కథాకథనాలు .. గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. తమన్ అందించిన రీ రికార్డింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేస్తున్నాము .. కచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.