'కాంచన 3'పై అందరిలో పెరుగుతోన్న ఆసక్తి
- లారెన్స్ నుంచి మరో హారర్ థ్రిల్లర్
- సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
- ఈ నెల 19వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఇప్పటివరకూ వచ్చిన టీజర్ .. ట్రైలర్ మరింతగా భయపెట్టేలా ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు తాను చేసిన హారర్ సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని లారెన్స్ చెప్పిన దగ్గర నుంచి, అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. డిఫరెంట్ లుక్ తో లారెన్స్ కనిపించే ఈ సినిమా, ఆయనకి భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.