దర్శకుడిగా చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలనుంది: లారెన్స్
- 'కాంచన 3' అందరికీ నచ్చుతుంది
- నాగార్జున అవకాశం ఇచ్చారు
- చిరంజీవి ప్రోత్సహించారు
ఈ వేదికపై లారెన్స్ మాట్లాడుతూ .. 'కాంచన 3' కూడా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుందని అన్నారు. తెలుగులో నేరుగా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కథలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా చెప్పారు. గతంలో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నాగార్జునగారితో మరో సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఇక మొదటి నుంచి కూడా తనని ప్రోత్సహించిన చిరంజీవిగారితోను ఒక సినిమా తెరకెక్కించాలని ఉందని అన్నారు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.