అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడట
- ఏప్రిల్ 8వ తేదీన బన్నీ బర్త్ డే
- ఆ రోజునే కొత్త సినిమా లాంచ్
- 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రల కోసం కాస్త బరువు తగ్గవలసి ఉంటుందని త్రివిక్రమ్ చెప్పడంతో, కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అదే పనిలో వున్నాడని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమాలో, కథానాయికలుగా పూజా హెగ్డే .. కేథరిన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.