'118' సినిమాకి నివేద వెన్నెముక .. షాలినీ పాండే ప్రత్యేక ఆకర్షణ
- నా నమ్మకం నిజమైంది
- ఆ పాత్రలో మరొకరిని ఊహించడం కష్టం
- ప్రేక్షకులకు ధన్యవాదాలు
కల్యాణ్ రామ్ .. నివేదా.. షాలినీ తో పాటు దర్శక నిర్మాతలు .. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "కొత్త కాన్సెప్ట్ కి ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా వుంటుందనే నమ్మకంతో ఈ సినిమా చేశాను .. నా నమ్మకం నిజమైంది. ఈ సినిమాకి నివేదా థామస్ వెన్నెముక అనే చెప్పాలి. ఆమె కాకుండా ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమే. ఇక ఈ సినిమాకి షాలినీ పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని అన్నారు.