కొంతమంది హీరోలు నేను వాళ్లను డామినేట్ చేస్తున్నానని ఫీలయ్యేవాళ్లు: 'పెళ్లి' పృథ్వీరాజ్
- మొదట్లో నాకు తెలుగు మాట్లాడటం రాదు
- మధ్యలో కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకున్నాను
- నేను బాగా చేసిన సీన్స్ ను లేపేసేవాళ్లు
'పెళ్లి' తరువాత నాకు వెంటనే అవకాశాలు రాకపోవడానికి కారణం, తెలుగు భాష రాకపోవడమే అనే విషయం అర్థమైపోయింది .. ఆ తరువాత భాషపై దృష్టిపెట్టి వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లాను. ఆ తరువాత ఒక 6 నుంచి 8 సంవత్సరాలపాటు బ్రేక్ తీసుకున్నాను. అందుకు రెండు కారణాలు వున్నాయి. ఒక కారణం ఏమిటంటే .. సినిమాలో నేను బాగా చేసిన సీన్స్ ను లేపేస్తూ ఉండటం. కొంతమంది హీరోలు నటనలో తమని నేను డామినేట్ చేస్తున్నట్టుగా అనుకుని, అందుకు సంబంధించిన సీన్స్ ను తీయించేసేవాళ్లు. అలా చాలాసార్లు జరుగుతూ రావడంతో, ఒక రకమైన విరక్తితో నేను సినిమాలు చేయడం మానేశాను" అని చెప్పుకొచ్చారు.