'ప్రేమకథా చిత్రమ్ 2' విడుదల తేదీ ఖరారు
- హారర్ థ్రిల్లర్ గా 'ప్రేమకథా చిత్రమ్ 2'
- ప్రధాన పాత్రధారిగా నందిత శ్వేత
- ఏప్రిల్ 6వ తేదీన భారీ విడుదల
సుదర్శన్ రెడ్డి నిర్మాతగా .. హరికిషన్ దర్శకుడిగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో దెయ్యం పాత్రలో నందిత శ్వేత అదరగొట్టేసింది. దాంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ప్రేమకథతో ముడిపడిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకూ భయపెడుతుందో చూడాలి.