హాలీవుడ్ రీమేక్ లో ఆమిర్ ఖాన్
- బాలీవుడ్ స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్
- విభిన్నమైన కథలు .. విలక్షణ పాత్రలు
- 'ఫారెస్ట్ గంప్' పై దృష్టిపెట్టిన ఆమిర్
కొంతకాలం క్రితం వచ్చిన 'ఫారెస్ట్ గంప్' హాలీవుడ్ క్లాసిక్స్ లలో ఒకటిగా నిలిచిపోయింది. టామ్ హాంక్స్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, 6 ఆస్కార్ పురస్కారాలను సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా రీమేక్ హక్కులను ఆమిర్ ఖాన్ దక్కించుకున్నాడట. ఆమిర్ ఖాన్ చేయనున్న ఈ సినిమా గురించే ఇప్పుడు అంతా బాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు.