కార్తీ కొత్త సినిమా నుంచి ఫస్టులుక్
- 'దేవ్' సినిమాతో పరాజయం
- తాజా చిత్రంగా 'కైథీ'
- దర్శకుడిగా లోకేశ్
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రక్తధారలతోనే చెరసాల .. ఆ చెరసాలలో కార్తీ ఉన్నట్టుగా ఫస్టు పోస్టర్ ను వదిలారు. ఈ ఫస్టులుక్ ను పోస్ట్ చేసిన కార్తీ, మంచి నటీనటులతో .. సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.