'118' చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను: మహేశ్ బాబు
- ఈ నెల 1న థియేటర్లకు వచ్చిన '118'
- దర్శకుడిగా గుహన్ తొలి సినిమా
- అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్
'118' చూసిన సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా స్పందించాడు. ఆకట్టుకునే కథ .. ఆసక్తిని రేకెత్తించే కథనంతో సాగే ఈ సినిమాను చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేసినట్టుగా చెప్పాడు. సినిమాటోగ్రఫర్ గా .. దర్శకుడిగా గుహన్ అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ప్రశంసించారు. ఈ సినిమా ఈ స్థాయిలో తెరపై ఆవిష్కరించబడటానికి కారణమైన టీమ్ కి ఆయన అభినందనలు తెలియజేశాడు. మహేశ్ బాబు స్పందనకి ఈ సినిమా టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనకి ధన్యవాదాలు తెలియజేసింది.