'కాంచన 3' రిలీజ్ డేట్ ఖరారు
- లారెన్స్ హారర్ సినిమాలకి మంచి క్రేజ్
- నాయికలుగా ఓవియా .. వేదిక
- మే 1వ తేదీన విడుదల
తమిళ .. తెలుగు భాషల్లో ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం. 'మహర్షి' సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయాలనుకున్నప్పుడు 'కాంచన 3'ని 18న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు 'మహర్షి' మే 9కి వెళ్లగా.. 'కాంచన 3' మే 1కి వచ్చింది. మొత్తానికి 'మహర్షి'కి ఓ వారం రోజులముందే ఉంటుందన్న మాట.