'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ఒరిజినల్ ఫొటోను పోస్ట్ చేసిన దర్శకుడు
- ఉయ్యాలవాడ వర్ధంతి
- ఆయన అసలు చిత్రం ఆవిష్కరణ
- 'సైరా' యూనిట్ ఘన నివాళి
"మా హీరో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఇదే మా సెల్యూట్' అని నివాళులు అర్పిస్తూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఉయ్యాలవాడ అసలు చిత్రాన్ని చూస్తే దేశభక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలగక మానదు. అమితాబ్ .. నయనతార .. తమన్నా .. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ వంటి భారీ తారాగణంతో రూపొందుతోన్న 'సైరా' సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి. చిరంజీవి కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రమవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.