మహానాయకుడు చూసి ఏడ్చేసిన పూరి జగన్నాథ్
- 'మహానాయకుడు' చిత్రం చాలా బాగుంది
- నాన్న మీద ప్రేమతో బాలయ్య ఎంతో ఇష్టంతో ఈ సినిమా చేశారు
- అసెంబ్లీలో ఎన్టీఆర్ కు జరిగిన సన్నివేశం చూసి వెక్కివెక్కి ఏడ్చాను
'మహానాయకుడు' సినిమా ఎంత గొప్పదో... బాలయ్య నటన కూడా అంతే గొప్పదని అన్నారు. బాలయ్యబాబు కెరీర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. నాన్నగారి మీది ప్రేమతో ఎంతో ఇష్టంతో ఈ సినిమా చేశారని చెప్పారు. 'థాంక్యూ బాలా' అంటూ పక్కనే ఉన్న బాలయ్యను అభినందించి, హత్తుకున్నారు. 'మహానాయకుడు' చిత్రం ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలయ్యతో కలసి పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అనంతరం మీడియాతో పూరి మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు.