'ఏబీసీడీ' నుంచి 'మెల్లమెల్లమెల్లమెల్లగా' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
- అల్లు శిరీశ్ తాజా చిత్రంగా 'ఏబీసీడీ'
- నాయికగా రుక్సాన్
- మార్చి 1న విడుదల
సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు శిరీశ్ జోడీగా రుక్సాన్ ధిల్లాన్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "మెల్లమెల్లమెల్లమెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే .. మెల్లమెల్లమెల్లమెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే .. "అంటూ ఈ పాట సాగుతోంది. మేకింగ్ షాట్స్ పై కట్ చేసిన ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆకట్టుకునేలా వుంది. జుడా శాండీ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ - అదితి భావరాజు ఆలాపన బాగున్నాయి. మార్చి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.