నిహారికతో సినిమా నిర్మించనున్న సుకుమార్!
- గ్యాప్ తీసుకున్న సుకుమార్
- అనిల్ రావిపూడికి దారిచ్చారంటూ వార్తలు
- సుకుమార్ శిష్యులలో ఒకరు దర్శకత్వం
మహేశ్‌తో సినిమా మాటెలా ఉన్నా.. ఆమధ్య ‘సుకుమార్ రైటర్స్’ అనే సంస్థను స్థాపించిన సుక్కు ప్రస్తుతం చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోయాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి రెండు సినిమాలను నిర్మిస్తున్న సుక్కు.. నాగబాబు కూతురు నిహారిక కొణిదెలతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా అని.. సుక్కు శిష్యులలో ఒకరు దర్శకత్వం వహిస్తారని ఫిలింనగర్ టాక్.