నయనతార పెళ్లి విషయంలో మరో రూమర్
- తిరుగులేని కథానాయికగా నయనతార
- స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్
- విఘ్నేశ్ శివన్ తో పెళ్లి గురించిన టాక్
దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఆమె ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ .. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూనే వుంది. రేపో మాపో వాళ్లు పెళ్లి చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో రూమర్ పుట్టుకొచ్చింది. వివిధ భాషల్లో కలుపుకుని తాను 100 సినిమాలను పూర్తి చేసిన తరువాతనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి నయనతార వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇంతవరకూ ఆమె 60కి పైగా సినిమాల్లో నటించగా .. ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. నయనతార అనుకున్న మార్క్ ను చేరుకోవాలంటే ఓ నాలుగైదేళ్లు పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.