'మజిలీ' నుంచి టీజర్ వచ్చేస్తోంది
- శివ నిర్వాణ తదుపరి చిత్రంగా 'మజిలీ'
- ఈ నెల 14న టీజర్ రిలీజ్
- ఏప్రిల్ 5న సినిమా రిలీజ్
ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజున ఉదయం 9 గంటల 9 నిమిషాలకి టీజర్ ను వదలనున్నట్టుగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు. గోపిసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.