'మజిలీ'లో ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట!
- శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ'
- ప్రత్యేక పాత్రలో దివ్యాంశ కౌశిక్
- ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో సమంతతో పెళ్లికి ముందు ఒక లుక్ తో .. పెళ్లి తరువాత మరో లుక్ తో చైతూ కనిపిస్తాడని అంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. పెళ్లైన తరువాత చైతూ .. సమంత కలిసి చేస్తోన్న సినిమా కావడం, అందునా ప్రేమికులుగా .. ఆ తరువాత భార్యాభర్తలుగా ఈ సినిమాలో వాళ్లిద్దరూ కనిపించనుండటం వలన అందరిలోనూ ఆసక్తి వుంది.