సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- డబ్బింగ్ లో రాయ్ లక్ష్మి 'వెంకటలక్ష్మి'
- సుబ్బరాజుకి రజనీ మరో ఆఫర్
- మహేశ్ 'మహర్షి' విడుదల వాయిదా?
* రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తాజాగా వచ్చిన 'పేట' చిత్రం తమిళనాట హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో దర్శకుడు సుబ్బరాజుకి రజనీ మరో సినిమా చేసే ఆఫర్ ఇచ్చాడట. మరో కొత్త తరహా కథను తనకోసం తయారుచేయమని చెప్పాడని సమాచారం.
* మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ఆమధ్య నిర్మాతలు ప్రకటించారు. అయితే, ఇప్పుడు దీనిని ఏప్రిల్ 26కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. విడుదల వాయిదాకు కారణం తెలియాల్సివుంది.