ఆ ప్రచారంలో నిజం లేదు: కైరా అద్వాని
- నేను సంతకం చేసినట్టు కథనం వచ్చింది
- ఆ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నా
- నన్ను ఎవరూ సంప్రదించలేదు
2009లో వచ్చిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రం సీక్వెల్ కోసం ఇంతియాజ్.. కైరాను కలిసినట్టు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కైరా తనను ఈ చిత్రం కోసం ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. ‘ఇంతియాజ్ అలీ తర్వాతి సినిమాకు నేను సంతకం చేసినట్లు ఓ వార్తా పత్రిక రాసింది. ఆ వార్తలు నిజం కావాలని నేనూ కోరుకుంటున్నా. ఈ ప్రచారం నిజం కాదు. పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు’ అని కైరా ట్వీట్ చేసింది.