ప్రభాస్ తో దిల్ రాజు సంప్రదింపులు
- 'కేజీఎఫ్' దర్శకుడిగా ప్రశాంత్ నీల్
- కథ రెడీ చేయమని చెప్పిన ప్రభాస్
- రంగంలోకి దిగిన దిల్ రాజు
ఈ సినిమా తరువాత ప్రభాస్ .. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచి కథను రెడీ చేయమని ఆయనకి ప్రభాస్ చెప్పాడట. ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడనేది తాజా సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక విభిన్నమైన కథాకథనాలతో ప్రభాస్ .. దిల్ రాజులను ఒప్పించవలసిన బాధ్యత ప్రశాంత్ నీల్ పైనే ఉందన్న మాట.