ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'ఆవిరి' ఫస్టులుక్
- 'అవును'తో మెప్పించిన రవిబాబు
- మరో హారర్ థ్రిల్లర్ కి రంగం సిద్ధం
- ఉత్కంఠను పెంచుతోన్న రవిబాబు
న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు. తనని తాను మరిచిపోయి నాట్యం చేస్తోన్న ఓ యువతిని గాజు సీసాలో ఒక రాక్షసుడు బంధిస్తునట్టుగా ఈ పోస్టర్లో చూపించారు. పోస్టర్ ను బట్టి ఇది సస్పెన్స్ తో కూడుకున్న హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. గతంలో 'అవును' సినిమాతో మెప్పించిన రవిబాబు, మరోమారు ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడన్న మాట.