మలయాళంలో చరణ్ సినిమాల సందడి
- మలయాళంలోకి 'రంగస్థలం'
- జనవరి 18వ తేదీన విడుదల
- 25వ తేదీన 'వినయ విధేయ రామ'
ఇక చరణ్ తాజా చిత్రంగా 'వినయ విధేయ రామ' సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కూడా కేరళలో విడుదల చేయనున్నారు. జనవరి 25వ తేదీన అక్కడ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఒకే నెలలో .. చాలా తక్కువ గ్యాప్ లో మలయాళ ప్రేక్షకుల ముందుకు చరణ్ సినిమాలు వెళుతుండటం విశేషం. ఈ రెండు సినిమాలకి మంచి రెస్పాన్స్ వస్తే, అక్కడ చరణ్ మార్కెట్ మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.