ఈ సారి ఓ కొత్త ప్రయోగం చేశాను: సుమంత్
- సుమంత్ హీరోగా 'ఇదమ్ జగత్'
- ప్రెస్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించే కథ
- ఈ నెల 28వ తేదీన రిలీజ్
ఈ సినిమాలో నేను హీరోను అని గానీ .. విలన్ ను అని గాని చెప్పను. ఈ రెండింటికి అతీతంగా నా పాత్ర ఉంటుంది. ఒక రిపోర్టర్ స్వార్థపరుడైతే అతను ఏం చేయగలడు? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రెస్ లోని మరో కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో నేను ఒక ప్రయోగమే చేశాను. ఈ ప్రయోగం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.