'దటీజ్ మహాలక్ష్మి' నుంచి టీజర్ వచ్చేసింది
- హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్'
- తెలుగు రీమేక్ గా 'దటీజ్ మహాలక్ష్మి'
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
రాజమండ్రి దగ్గరలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఫ్రాన్స్ వెళ్లిన మహాలక్ష్మికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మహాలక్ష్మి అమాయకత్వం .. రాజమండ్రిపై ఆమెకి గల ప్రేమ .. విదేశీ సంస్కృతిలో ఇమడటానికి ఆమె పడిన ఇబ్బందులనే ఈ టీజర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.