Deepika Padukone: రణబీర్ కపూర్ 'జ్ఞాపకాన్ని' వదిలించుకోలేకపోయిన దీపికా పదుకునే

  • గతంలో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన దీపిక
  • మెడపై ఆర్కే అనే టాటూ వేయించుకున్న వైనం
  • రణవీర్ తో అఫైర్ తర్వాత టాటూను తొలగించుకునే ప్రయత్నం

ఇటీవలే బాలీవుడ్ ప్రేమికులు దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. గతంలో హీరో రణబీర్ కపూర్ తో దీపిక ప్రేమాయణం కొనసాగించింది. ప్రియుడిపై ఉన్న ప్రేమతో అప్పట్లో తన మెడపై ఆమె ఆర్కే (రణబీర్ కపూర్) అని టాటూ వేయించుకుంది. రణవీర్ తో ప్రేమ మొదలైన తర్వాత ఆ టాటూను తొలగించుకునేందుకు ఎంతో ప్రయత్నించి విఫలమైంది.

ఇటలీలో పెళ్లి తర్వాత ఆమె మెడపై టాటూ ఉందేమోనని మీడియా కెమెరాలు వెతికాయి. అయితే, మేకప్ ద్వారా టాటూ కనపడకుండా ఆమె జాగ్రత్త పడింది. దీంతో, ఆమె టాటూను తొలగించుకుందని అందరూ భావించారు. కానీ, ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా పెళ్లికి తన భర్తతో పాటు వచ్చిన దీపిక మెడపై టాటూ మళ్లీ కనిపించింది.

Deepika Padukone
ranveer singh
ranbir kapoor
tatoo
  • Loading...

More Telugu News