మలైకా, అర్జున్ కపూర్ ల అఫైర్ పై అనిల్ కపూర్ స్పందన!
- అర్జున్ కు ఏదైతే సంతోషాన్నిస్తుందో.. తనకు కూడా అదే ఆనందాన్నిస్తుందన్న అనిల్ కపూర్
- అన్ని ఫంక్షన్లకు కలిసే హాజరవుతున్న మలైకా, అర్జున్
- గత ఏడాది అర్భాన్ ను విడాకులు తీసుకున్న మలైకా
ఈ సందర్భంగా మలైకా, అర్జున్ ల అఫైర్ పై అనిల్ ను నేహా ప్రశ్నించింది. దీనిపై అనిల్ స్పందిస్తూ, 'అర్జున్ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఏదైతే అర్జున్ కు సంతోషాన్ని కలగజేస్తుందో... నాక్కూడా అదే సంతోషాన్ని కలిగిస్తుంది' అని తెలిపారు. అనిల్ సమాధానంతో వీరిద్దరి అనుబంధంపై చర్చ మరింత ఎక్కువైంది. పెళ్లి బాజాలు మోగబోతున్నాయనే అంచనాకు బాలీవుడ్ అభిమానులు వచ్చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో మలైకా, అర్జున్ లు అన్ని ఫంక్షన్లకు కలిసే హాజరవుతున్నారు. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో అర్జున్ మాట్లాడుతూ, ఒక వ్యక్తితో తాను డేటింగ్ చేస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే, మలైకా అరోరా పేరును మాత్రం ఆయన ప్రస్తావించలేదు. 43 ఏళ్ల మలైకా గత ఏడాదే అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకుంది. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. మలైకా కంటే అర్జున్ 10 ఏళ్లు చిన్నవాడు.